ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సోమశిల జలాశయాన్ని సందర్శించిన సీడీఓ బృందం - Nellore district

CDO Visit somasila: సోమశిల జలాశయాన్ని సీడీఓ బృందం సందర్శించింది. 2020-21 భారీగా వరద ప్రవాహం వచ్చి జలాశయం దిగువ భాగం పూర్తిగా దెబ్బతినటంతో నిపుణుల కమిటి పరిశీలించింది. రాబోయే రోజుల్లో ఎంత వరద ప్రవాహం వచ్చినా.. ఎదుర్కొనే విధంగా పటిష్ఠమైన పనులు చేయాలని అధికారులకు సూచించారు.

CDO Visit somasila
CDO Visit somasila

By

Published : Mar 13, 2022, 9:45 PM IST

CDO Visit somasila: నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం వరద నష్టాలను సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ) సీఈతోపాటు ఇతర అధికారులు పరీశీలించారు. 2020-21 భారీగా వరద ప్రవాహం వచ్చి జలాశయం దిగువ భాగం పూర్తిగా దెబ్బతినటంతో ఇటీవల నిపుణుల కమిటి పరిశీలించింది. అనంతరం సీడీఓ బృందం పరీశీలించారు. డౌన్ స్ట్రీమ్ కాలువ పక్కన దెబ్బతిన్న కాంక్రీట్ వాల్​ను ఎడమ కుడి వైపు రక్షణ కట్టలను పరీశీలించారు.

జలాశయం నీరు పెన్నానదిలో కలిసే ప్రాంతాలను గమనించారు. పెన్నానది మట్టంతో పాటు పలు వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. రూ.99 కోట్లతో రక్షణ పనులకు టెండర్లు పూర్తవటంతో పనులు చెపట్టే ముందు సీడీవో బృందం పరీశీలించి పలుసూచనలు చేసింది. రాబోయే రోజుల్లో ఎంత వరద ప్రవాహం వచ్చినా.. ఎదుర్కొనేవిధంగా పటిష్ఠమైన పనులు చేయాలని సూచించారు.

ఇదీ చదవండి:'పుష్ప' సీన్​ రిపీట్​.. వాటర్ ట్యాంకర్​లో 1100 కేసుల మద్యం

ABOUT THE AUTHOR

...view details