రూ.24.70 లక్షల నగదు అపహరణ కేసును నెల్లూరు జిల్లా పోలీసులు ఛేదించారు. ఓ పెట్రోలు బంకులో విధులు నిర్వహిస్తున్న రమేశ్ కు, ఓ వ్యక్తి బ్యాంకులో నగదు కట్టమని రూ.24.70 లక్షలు ఇచ్చాడు. ఈ క్రమంలో రమేశ్ బ్యాంకులో డబ్బులు కట్టకుండా నగదుతో ఉడాయించాడు. విషయం తెలుసుకున్న బాధితుడు... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ అభినందించారు.
చోరీ కేసును ఛేదించిన పోలీసులు... నిందితుడు అరెస్టు
నెల్లూరు జిల్లాలో డబ్బుతో పారిపోయిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి, రూ.24.70లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
చోరీ కేసును ఛేదించిన పోలీసులు