రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలలో.. సీసీ కెమెరాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సన్నాహాల్లో భాగంగా పలు దేవాలయాలలో గత రెండు రోజులుగా ఆలయ నిర్వాహకులు సీసీ కెమెరాల ఏర్పాట్లు చేపడుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో స్థానిక పోలీసుల సూచనలతో ఆలయ ధర్మకర్త, జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి సీసీ కెమెరాల ఏర్పాటు చేయించారు. దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సీసీ కెమెరాల ఆధారంతో గుర్తించడానికి వీలుగా వాటిని అమర్చారు.
ఆత్మకూరులోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో సీసీ కెమెరాల ఏర్పాటు.. - దేవాలయాలపై జరుగుతున్న దాడులు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసుల సూచనలతో ఆలయ ధర్మకర్త, జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి.. సీసీ కెమెరాల ఏర్పాటు చేయించారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కొనసాగుతోంది.
శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో సీసీ కెమెరాల ఏర్పాటు..