CBI investigation in Nellore: మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి నిందితుడుగా ఉన్న ఫోర్జరీ కేసుకు సంబంధించి నెల్లూరు కోర్టులో పత్రాల చోరీపై, సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. పిటిషనర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీబీఐ బృందాన్ని కలిశారు. రోడ్లు భవనాల శాఖ గెస్ట్ హౌస్‌లో, సీబీఐ ఎస్పీ నిర్మలాదేవి, ఏఎస్పీ అనంత కృష్ణకు, సోమిరెడ్డి పలు పత్రాలు ఆందించారు. రెండురోజులుగా జరుగుతున్న విచారణలో సీబీఐ అధికారులు పలువురు పోలీసులతోపాటు కోర్టు సిబ్బందినీ ప్రశ్నించారు. గతేడాది ఏప్రిల్‌లో నెల్లూరు కోర్టులో దొంగలు పడి, మంత్రి కాకాణి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసు తాలుకా పత్రాలు చోరీ చేసినట్లు కేసు నమోదైంది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
నెల్లూరు కోర్టులో పత్రాల చోరీ కేసు.. కొనసాగుతున్న సీబీఐ విచారణ
CBI investigation into the theft of documents: మంత్రి కాకాణి ఆరోపణలు ఎదుర్కొంటున్న కోర్టులో పత్రాల చోరీ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది. నెల్లూరులో రెండు రోజులుగా సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. రోడ్లు, భవనాల శాఖ గెస్ట్ హౌస్‌లో సీబీఐ ఎస్పీ నిర్మలా దేవి, ఏఎస్పీ అనంత కృష్ణ విచారిస్థున్నారు. సీబీఐ విచారణకు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి హాజరయ్యారు.
సీబీఐ విచారణ
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి: వైసీపీ హయాంలో కోర్టుల్లోనూ న్యాయం జరగటం కష్టంగా మారిందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది నెల్లూరు కోర్టులో మంత్రి కాకాణి కేసు ఆధారాల చోరీ కేసులో సీబీఐ దర్యాప్తు 2 రోజులుగా కొనసాగుతుండగా. సీబీఐ అధికారులు సోమిరెడ్డిని విచారించారు. కేసుకు సంబంధించి పలు పత్రాలను అధికారులకు సమర్పించినట్లు సోమిరెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి:
Last Updated : Jan 6, 2023, 8:15 PM IST