వైఎస్ భాస్కర్‌రెడ్డి కోసం సీబీఐ ఆరా.. పార్టీ కార్యాలయంలో లేకపోవండతో ఇంటికి వెళ్లిన అధికార్లు
15:47 January 23
కడప నుంచి పులివెందులకు చేరుకున్న సీబీఐ అధికారులు
YS VIVEKA MURDER CASE UPDATES : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. చాలా రోజుల తర్వాత పులివెందుల చేరుకున్నసీబీఐ అధికారులు.. వైఎస్ భాస్కర్ రెడ్డి కోసం ఆరా తీశారు. ఈ కేసులో ప్రధానంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పులివెందులలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు... అక్కడ భాస్కర్‌రెడ్డి కార్యాలయానికి వచ్చారా అని ఆరా తీశారు.
ఈ రోజు కార్యాలయానికి రాలేదని కార్యకర్తలు చెప్పడంతో సీబీఐ అధికారులు వెనుతిరిగివెళ్లారు. అక్కడి నుంచి నేరుగా సమీపంలోనే ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటి పరిసరాలను పరిశీలించారు. భాస్కర్ రెడ్డి ఇంటి పనిమనిషితో మాట్లాడి ఆయన గురించి ఆరా తీశారు. వివేకా కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణ సీబీఐ కోర్టుకు బదిలీ అయిన తర్వాత.. ఇక్కడకు వచ్చిన సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డి కోసం ఆరా తీయడం చర్చనీయాంశమైంది.
ఇవీ చదవండి: