ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల రోజుల తర్వాతే  చంద్రయాన్-2...!

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం నెల్లూరు జిల్లా శ్రీ హరికోటలోని సతీష్ ధవన్ కేంద్రం లో ఈరోజు వేకువజామున 2.51 గంటలకు జరగాల్సిన చంద్రయాన్-2ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడింది.

చంద్రయాన్ అంతరాయానికి కారణాలు

By

Published : Jul 15, 2019, 1:02 PM IST

చంద్రయాన్ అంతరాయానికి కారణాలు

చంద్రయాన్-2 ప్రయోగానికి ఇంకా 56 నిమిషాల సమయం ఉందనగా శాస్త్రవేత్తలు జీ ఎస్ ఎల్వీ మార్క్ 3 లాంచర్​లో లోపాన్ని గుర్తించి కౌండౌన్ ఆపేశారు. లాంచర్​లో ఉన్న సాంకేతిక లోపం వలన ప్రయోగం వాయిదా వేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని వల్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా, కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ప్రయోగం నిరుపయోగం కాకుండా శాస్త్రవేత్తలు జాగ్రత్తపడ్డారు. ప్రస్తుతం రాకెట్ ఇంజిన్‌లో నింపిన కయోజనిక్ ఇంధనం తొలగించి, వాహక నౌకను వెహికల్ అసెంబ్లీ బిల్డింగుకు తరలించి మరోసారి వాహక నౌకను పూర్తిగా పరిశోధించడానికి శాస్త్రవేత్తలు సన్నధమవుతున్నారు. భవిష్యత్తులో మానవసహిత ప్రయోగాలకు ఇటువంటి లోపాలు తలెత్తకుండా చూశారని ప్రయోగాలపై అవగాహన ఉన్నవారు అంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రయోగాన్ని నెల రోజుల తరువాతే ప్రయోగం జరిగే అవకాశాలున్నాయి.

ABOUT THE AUTHOR

...view details