నెల్లూరు జిల్లా ఉదయగిరి బస్టాండ్ కూడలి వద్దనున్న హోటల్లో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. హోటల్లోని నగదు కౌంటర్ బాక్స్‌ను తొలగించి అందులో ఉన్న రూ.60 వేల నగదును అపహరించారు. మిద్దెపై నుంచి హోటల్లోకి వచ్చే గేటు తాళాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విద్యుత్ సరఫరా బోర్డు వద్ద ఫ్యూజ్‌ను తొలగించి సీసీ కెమెరాల వైర్లను కట్ చేశారు. సోమవారం ఉదయం హోటల్‌ను తెరిచేందుకు వచ్చిన సిబ్బంది విషయాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
హోటల్లో చోరీ... 60 వేల నగదు అపహరణ - nellore district latest news
ఉదయగిరి బస్టాండ్ వద్ద హోటల్లో దొంగలు పడ్డారు. సోమవారం ఉదయం హోటల్ తెరిచేందుకు వచ్చిన సిబ్బంది ఈ విషయాన్ని గమనించారు. హోటల్ కౌంటర్ బాక్స్‌లో ఉన్న 60 వేల రూపాయల నగదును దుండగులు అపహరించారు.
హోటల్లో చోరీ