ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Case filed on Somireddy: కృష్ణపట్నం పోర్టు పీఎస్‌లో సోమిరెడ్డిపై కేసు! - Somireddy case news

Somi Reddy
కృష్ణపట్నం పోర్టు పీఎస్‌లో సోమిరెడ్డిపై కేసు నమోదు

By

Published : Jun 6, 2021, 11:44 AM IST

Updated : Jun 6, 2021, 12:22 PM IST

11:41 June 06

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు పీఎస్​లో.. తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. శశ్రిత టెక్నాలజీ ఎండీ నర్మదకుమార్ ఫిర్యాదు మేరకు.. సోమిరెడ్డిపై కేసు పెట్టారు. చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం ఆరోపణలతో ఈ కేసు నమోదు చేశారు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా కేసు నమోదైంది.

ఆనందయ్య మందుతో వ్యాపారం చేయడానికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రయత్నాలు చేశారని... ఈమేరకు శశ్రిత వెబ్​సైట్ ప్రారంభమైందని సోమిరెడ్డి శనివారం ఆరోపించారు. ఆ వెబ్​సైట్ నిర్వాహకులు పూర్తిగా కాకాణి కనుసన్నల్లో పనిచేస్తున్నారని అన్నారు. ఈమేరకు శశ్రిత నిర్వాహకులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

Anandaiah Medicine: రేపటి నుంచే ఆనందయ్య మందు పంపిణీ.. ముందుగా అక్కడే..!

Last Updated : Jun 6, 2021, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details