209 ఎకరాల భూ రికార్డులు తారుమారు.. రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసు - నెల్లూరు జిల్లా
16:07 September 26
NLR_ Case on Revenue officials_209 acres golmal_BReaking
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో జరిగిన భూముల గోలుమాల్ వ్యవహారంలో రెవెన్యూ అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇద్దరు రెవెన్యూ అధికారులను, 11మంది ప్రవేటు వ్యక్తులతో కలిపి మొత్తం 13 మందిపై కేసు నమోదు చేశారు.
గతంలో తమ్మినపట్నంలో 209 ఎకరాల పోర్టు భూముల భూ రికార్డుల తారుమారులో తహసీల్దార్, ఆర్ఐ, కంప్యూటర్ ఆపరేటర్‌పై ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టారు. ఇద్దరు రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేశారు. భూ రికార్డుల తారుమారులో ప్రమేయం ఉన్న వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ గీత వాణి, ఆర్ఐ సిరాజ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
ఇదీ చదవండి:MINISTER ANIL: రూ.550 కోట్లతో నెల్లూరు నగర అభివృద్ధి: మంత్రి అనిల్