ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాయుడుపేటలో ఇద్దరికి కరోనా.. అప్రమత్తమైన అధికారులు - carona positive cases in nellore

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఇద్దరికి కరోనా సోకింది. అధికారులు అప్రమత్తమయ్యారు. చెన్నై కోయంబేడు మార్కెట్ పాజిటివ్ కేసుల ప్రభావం సూళ్లూరుపేట, నాయుడుపేటపై పడుతున్న పరిస్థితుల్లో.. కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నారు.

nellore district
నాయుడుపేటలో రెండు పాజిటివ్ కేసులు.. అప్రమత్తమైన అధికారులు

By

Published : May 14, 2020, 7:43 AM IST

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో ఇద్దరికి కరోనా సోకింది. అప్రమత్తమైన అధికారులు పరిశుభ్రత చర్యలు చేపట్టారు. వైరస్ నాశక ద్రావణాన్ని పిచికారీ చేయించారు. నాయుడుపేట చంద్రబాబు నగర్ కు చెందిన తండ్రీ, కొడుకు... చెన్నైలో వ్యాపారం చేస్తున్న క్రమంలో కరోనాబారిన పడ్డారు.

ఇద్దరూ అక్కడి క్వారంటైన్ నుంచి పారిపోయి వచ్చారు. ఇక్కడి అధికారులు గుర్తించి నాయుడుపేట క్వారంటైన్ కు తరలించి పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్ అని ఫలితం వచ్చింది. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల వారిని ఇక్కడి క్వారంటైన్ కు త‌రలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details