గిట్టుబాటు ధర రాక విలవిల్లాడుతున్న పొగాకు రైతును కరోనా ప్రభావం మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. వైరస్ ప్రభావంతో ఇతర దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయని పొగాకు బోర్డు చెప్పటంతో నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పొగాకు కేంద్రం వద్దకు తీసుకువచ్చిన పొగాకు బేళ్లను కొనేవారు లేక ఉసూరుమంటూ ఇంటికి తిరిగి తీసుకువెళ్తున్నారు. కరోనా అనేది కేవలం ఒక సాకు మాత్రమేనని.. పొగాకు రైతులకు బోర్డు ఎప్పుడూ గిట్టుబాటు ధర కల్పించటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించి తమను ఆదుకోవాలని పొగాకు రైతులు వేడుకుంటున్నారు.
కరోనా ప్రభావంతో నిలిచిన పొగాకు ఎగుమతులు.. రైతుల ఇబ్బందులు - డీసీపల్లి పొగాకు రైతుపై కరోనా వైరస్ ప్రభావం
వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ పొగాకు రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇతర దేశాలకు పొగాకు ఎగుమతులు నిలిచిపోవటంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పొగాకుపై కరోనా ప్రభావం
పొగాకుపై కరోనా ప్రభావం.. నిలిచిన ఎగుమతులు