Anil Kumar Yadav: నెల్లూరు నగరంలో అధికార పార్టీలో వర్గపోరు దాడులకు దారితీసింది. ఎమ్మెల్యే అనిల్ కుమార్, ఆయన బంధువు రూప్ కుమార్ యాదవ్ మధ్య..ఆధిపత్యపోరు కొనసాగుతున్న వేళ.. ఓ వైకాపా నాయకుడిపై దాడి విభేదాలను మరింత రాజేసింది. ఎమ్మెల్యేనే దాడి చేయించారని ఆరోపించిన రూప్‌కుమార్ యాదవ్.. ప్రతికార చర్యలు మొదలుపెడితే ఊహకు అందని పరిణామాలుంటాయని హెచ్చరించారు. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని అనిల్ వ్యాఖ్యానించడంతో నెల్లూరు రాజకీయం వైకాపాలో చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పార్టీపై ధిక్కార స్వరంతో నెల్లూరు రాజకీయాలపై ఇప్పటికే కలవరపడుతున్న వైసీపీ పెద్దలకు..ఎమ్మెల్యే అనిల్, ఆయన బంధువు రూప్‌కుమార్ మధ్య విభేదాలు కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయి. ఇటీవల నెల్లూరు జిల్లాకు వచ్చిన సీఎం జగన్.. మాజీ మంత్రి అనిల్ కుమార్, ఆయన బాబాయ్ రూప్ కుమార్‌ని పిలిచి నచ్చజెప్పారు. కలిసి ఉంటే కలదు సుఖం అని నచ్చచెప్పారు. అయినా ఇద్దరూ కలవకపోగా వర్గ విబేధాలు మరింత ఎక్కువయ్యాయి. తాజాగా రూప్ కుమార్ అనుచరుడిపై దాడి... మరోసారి ఇద్దరి మధ్య విబేధాలను బయటపెట్టాయి. శుక్రవారం అర్ధరాత్రి వైకాపా విద్యార్ధి నాయకుడు హాజీపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి.. హాజీని పరామర్శించారు. తనపై దాడి చేయించింది ఎమ్మెల్యే అనిల్ అని బాధితుడు ఆరోపించాడు. హాజీ, వైకాపా నాయకుడు