ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చలించిన వ్యాపారులు... వలస కూలీలకు పాదరక్షలు! - నెల్లూరులో వలసకూలీలకు చెప్పుల పంపిణీ

ఇంటికి వెళ్లాలని ఆకాంక్షతో కాళ్లకు చెప్పులున్నా లేకున్నా.. వలస కూలీల ఎన్నో వేల కిలోమీటర్లు.. బతుకుప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి వలసకూలీల పరిస్థితులను చూసి నెల్లూరు నగరంలో సండే మార్కెట్ వ్యాపారస్థులు అందరికి చెప్పులు, ఆహారం అందించారు.

Businessmen distributed   sandals to migrant workers in nellore
నెల్లూరులో వలసకూలీలకు చెప్పుల పంపిణీ

By

Published : May 17, 2020, 8:52 AM IST

వలస కార్మికులు పాదరక్షలు లేకుండా వందల కిలోమీటరు నడుస్తున్నారు. ఓ దిక్కు కాళ్లు పగిలిపోతున్నాయి. ఎండ తీవ్రతకు కాళ్లు బొబ్బలు ఎక్కుతున్నాయి. రాళ్లు గుచ్చుకుని పుండ్లు పడుతున్నాయి. వారి పరిస్థితులను చూసిన నెల్లూరు నగరం సండే మార్కెట్ వ్యాపారస్థులు చలించిపోయారు.

జాతీయ రహదారిపై నడుస్తూ వెళ్తున్న వలస కార్మికులకు చెప్పులు పంపిణీ చేశారు. సుందరయ్య నగర్ వద్ద హైవే పై చెన్నై నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే వలస కార్మికులకు వీటిని అందజేశారు. చెప్పుల జతలతోపాటు బిస్కెట్ ప్యాకెట్లు, ఆహారం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details