ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో వ్యవసాయ రంగానికి రూ. 7,700 కోట్లు కేటాయింపు - నెల్లూరు జిల్లా బడ్జెట్​ వార్తలు

వైకాపా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్​లో నెల్లూరు జిల్లాకు రూ. 13,590 కోట్లు మంజూరు చేసింది. వీటిలో ఒక్క వ్యవసాయరంగానికి రూ. 7,700 కోట్లు కేటాయించామని అధికారులు తెలిపారు.

budget allocation for nellore
2020-21 సంవత్సరానికి రుణ ప్రణాళికను విడుదల చేస్తోన్న అధికారులు

By

Published : Jun 17, 2020, 3:19 PM IST

Updated : Jun 17, 2020, 4:13 PM IST

నెల్లూరు నగరంలోని డీసీసీబీ ఆవరణలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ శేషగిరిబాబు పాల్గొన్నారు. 2020- 21 సంవత్సరానికి సంబంధించిన రుణ ప్రణాళికను ప్రారంభించారు. 2020-21కి సంబంధించి జిల్లాకు రూ. 13,590 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. .

ఇందులో వ్యవసాయరంగానికి రూ.7,700 కోట్లు విడుదల చేశారు.

  • పంట రుణాలకు రూ.5600 కోట్లు
  • దీర్ఘకాలిక రుణాలు రూ. 1600 కోట్లు
  • వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ. 200 కోట్లు
  • వ్యవసాయ అనుబంధ శాఖలకు రూ. 300 కోట్లు అధికారులు కేటాయించారు.

పారిశ్రామిక రంగాలకు రూ. 5,890 కోట్లు విడుదల చేశామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: రబీకి వరి విత్తనాలు సిద్ధం చేస్తున్న ఏపీ సీడ్స్‌ అధికారులు

Last Updated : Jun 17, 2020, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details