నెల్లూరు నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద సంస్థ ఎంప్లాయిస్ యూనియన్ ధర్నా కార్యక్రమం చేపట్టింది. బీఎస్ఎన్ఎల్ ను పునరుద్ధరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, నేరవేర్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
సరైన వసతులు కల్పించకుండా ప్రైవేటు కంపెనీలతో పోటీ పడాలంటే ఎలా అని ప్రశ్నించారు. 4జీ స్పెక్ట్రమ్ ను అందజేసి బీఎస్ఎన్ఎల్ ను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దశలవారీగా పోరాటం చేస్తామన్నారు.