నెల్లూరులో ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. నగరంలోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో పన్నెండేళ్ల బాలుడు ఆడుకుంటుండగా.. రాత్రి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశారు. బాలుడిని బలవంతంగా లాక్కునిపోయేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తించిన స్థానికులు.. ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు, మరొకరు పరారయ్యారు. స్థానికంగా నివాసం ఉండే నరేష్కుమార్ కుమారుడు అక్షిత్‌ను కిడ్నాప్ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. ఈ కిడ్నాప్ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్‌కు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్గామిట్ట పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు నగరంలో బాలుడి కిడ్నాప్‌కు యత్నం - nellore district latest news
నెల్లూరు నగరంలో బాలుడి కిడ్నాప్‌కు యత్నించడం కలకలం రేపింది. ఇద్దరు కిడ్నాప్‌కు ప్రయత్నించగా... స్థానికులు ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
నెల్లూరులో కిడ్నాప్ కలకలం