పెన్నా నదిలో సరదాగా ఈతకు వెళ్ళిన ఐదుగురు యువకులు నీటి ప్రవాహంలో చిక్కి విలవిల్లాడారు. వారిలో రవీంద్ర అనే యువకుడు ధైర్యం చేసి.. మిగతా నలుగురిని కాపాడాడు. చివరికి తానే పట్టు తప్పి నది ప్రహహంలో కోట్టుకుపోయి చనిపోయాడు. నెల్లూరు అనంతసాగరం మండలం రెవూరు గ్రామంలో ఎండ తీవ్రత తట్టుకోలేక.. నిత్యం పెన్నానదిలో యువకులు సరదగా ఈతకు వెళ్తుంటారు.
ఈ క్రమంలోనే ఈతకు వెళ్లి ప్రవాహంలో చిక్కుకున్నారు. ప్రమాద స్దలానికి చెరుకున్న పోలీసులు, పైర్ సిబ్బంది వారిని కాపాడే ప్రయత్నం చేశారు.. అప్పటికే నీటిప్రవాహంలో కోట్టుకో పోయిన రవీంద్రను ఆత్మకూరు మండలం అప్పారావు పాలెం దగ్గర గుర్తించినట్టు అధికారులు తెలిపారు.