నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని పెన్నా నది వద్ద ఎస్సీ కాలనీలో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు పిట్ట గోడ కూలి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం...కాలనీకి చెందిన అభిరామ్ తన ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పిట్ట గోడకూలి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
గోడకూలి నాలుగేళ్ల బాలుడు మృతి - నెల్లూరు జిల్లాలో విషాధం
నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పిట్టగోడ కూలి నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు
boy died in nellore dst sangam mandal due to wall smashed