ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోవిడ్ ప్రభావం.. వెలవెలబోతున్న పుస్తకాల వ్యాపారం - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

వేసవి సెలవుల్లో బాగా ఎంజాయ్ చేసి.. తిరిగి స్కూల్ తెరుచుకునే సమయానికి విద్యార్ధులంతా కొత్త పుస్తకాలు కొనుక్కునేందుకు బుక్​ షాపుల వద్ద క్యూ కడతారు. పుస్తక దుకాణాలకు ఆ టైమ్ లోనే మంచి గిరాకీ ఉంటుంది. పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్లు కొనడంలో విద్యార్థులు, తల్లిదండ్రులు బిజీబిజీగా ఉండేవారు. ఇప్పుడు కరోనా దెబ్బకు ఈ వ్యాపారం దారుణంగా దెబ్బతింది. విద్యా సంస్థలు తెరుచుకోక.. పిల్లలు ఇళ్లకే పరిమితం కావడంతో బుక్​షాపులు వెలవెలబోతున్నాయి.

book-shops
book-shops

By

Published : Jul 17, 2021, 10:18 AM IST

కొవిడ్‌-19 తో పూర్తిగా దెబ్బతిన్న పుస్తకాల వ్యాపారం

కరోనాతో విద్యాసంస్థలు మూతపడి, విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు పరిమితమైన వేళ.. పుస్తకాలతో పెద్దగా అవసరం లేకుండా పోయింది. హోల్ సేల్, రిటైల్ పుస్తక దుకాణాలు నష్టాల్లో నడుస్తున్నాయి. వడ్డీకి తెచ్చిన అప్పులు కట్టలేక దుకాణ నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. వ్యాపారాలు లేక దుకాణాల్లో పనిచేసే చిరుద్యోగులు ఉపాధికి దూరమవుతున్నారు.

కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలలకు పేరుగాంచిన నెల్లూరు జిల్లాలో సుమారు పదివేల పుస్తకాల దుకాణాలున్నాయి. స్టేషనరీ దుకాణాలు వందల సంఖ్యలో ఉన్నాయి. నెల్లూరు నగరంలోనే వందకు పైగా హోల్ సేల్ దుకాణాలు ఉన్నాయి. పాఠశాలలు, కళాశాలలు తెరవకపోవడంతో.. ఈ దుకాణాలు మొక్కుబడిగా నడుస్తున్నాయి. నెల్లూరు నుంచి కడప, ప్రకాశం జిల్లాలకు పుస్తకాలను సరఫరా చేస్తుంటారు.

ఏడాదికి 40 కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుందని అంచనా. అలాంటిది గతేడాది మార్చి నుంచి రెండు కోట్ల వ్యాపారం జరగలేదని దుకాణదారులు వాపోతున్నారు. దుకాణానికి నెలకు 25వేల నుంచి 40వేల రూపాయలు వరకు అద్దెలు కట్టలేక వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

'అవి.. బోర్డు పరిధిలోకి అవసరం లేదు': కేంద్ర గెజిట్​పై సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details