నెల్లూరు జిల్లా భీమునివారిపాలెం రేవుకు సంబంధించిన బోటు పులికాట్ సరస్సులో బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మంది ఉన్నారు. వీరు తడ మండలంలోని ఇరకం దీవి నుంచి భీమునిపాలెం బయలుదేరారు. పులికాట్ సరస్సు సగం దూరం ఉందనగా... బరువు అధికమై బోటు బోల్తా పడింది. ఒక్కసారిగా అందరు నీళ్లలో పడిపోయారు. దీంతో దిక్కుతోచని స్థితిలో గట్టిగా అరుపులు కేకలు వేశారు. ఘటన చూసిన వెనుకనే వస్తున్నమరో బోటులో వారు అందరనీ రక్షించారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. భీమునివారిపాలెనికి చేరుకోవటానికి సరైన రవాణా లేకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పులికాట్ సరస్సులో బోటు బోల్తా... 40 మంది సురక్షితం - పులికాట్ సరస్సులో బోటు బోల్తా... 40 మంది సురక్షితం
నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సులో ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది.ఈ ఘటనలో 40 మంది సురక్షితంగా బయటపడ్డారు.

పులికాట్ సరస్సులో బోటు బోల్తా... 40 మంది సురక్షితం
పులికాట్ సరస్సులో బోటు బోల్తా... 40 మంది సురక్షితం
ఇవీ చదవండి