ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

blast at kovuru: కోవూరులో భారీ పేలుడు.. ధ్వంసమైన భవనం - కోవూరులో భారీ పేలుడు వార్తలు

నెల్లూరు జిల్లా కోవూరు శ్మశానవాటిక వద్ద భారీ శబ్దంతో పేలుడు(blast at kovuru) సంభవించింది. భయంతో జనం పరుగులు తీశారు. పేలుడు ధాటికి శ్మశానవాటిక సమీప భవనం ధ్వంసమైంది.

కోవూరులో భారీ పేలుడు
కోవూరులో భారీ పేలుడు

By

Published : Nov 24, 2021, 10:55 PM IST

Updated : Nov 25, 2021, 6:09 AM IST

కోవూరులో భారీ పేలుడు.. ధ్వంసమైన భవనం

Blast at kovuru: నెల్లూరు జల్లా కోవూరులో భారీ పేలుడు సంభవించింది. స్థానిక మైదీలి హల్ ప్రాంతంలో ఒక గదిలో రాత్రి భారీ శబ్దంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కోవూరు ఒక్కసారి ఉలిక్కి పడింది. భయంతో జనం పరుగులు తీశారు. స్మశానవాటిక సమీపంలో నిల్వఉంచిన నల్ల మందు పేలిందా, లేకా బాంబులు పేలాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో పేలుడు ధాటికి భారీ గుంత పడింది. పేలుడు ధాటికి విద్యుత్​ స్తంభం నేలకూలడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

గురవారం తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. గురవారం వరద ప్రాంతాలు పర్యటన ఉన్న పరిస్థితుల్లో నేడు భారీ పేలుడు(blast in nellore distrcit) అనుమానాలకు దారి తీస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేస్తున్నారు.

Last Updated : Nov 25, 2021, 6:09 AM IST

ABOUT THE AUTHOR

...view details