ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేతబడి కలకలం.. ఇద్దరిని పోలీసులకు అప్పగింత - nellore district today news

నెల్లూరు జిల్లాలో చేతబడి చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నిర్మానుష్య ప్రాంతంలో కొత్త వ్యక్తులు ఉండటం గమనించిన స్థానికులు వారిని పోలీసులకు అప్పజెప్పారు.

black magic hal chal
నెల్లూరు జిల్లాలో చేతబడి కలకలం

By

Published : Jun 12, 2020, 11:44 AM IST


నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో చేతబడి కలకలం రేపింది. పడుగుపాడు గ్రామం నందలగుంట ప్రాంతంలో చేతబడి చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. నిర్మానుష్య ప్రాంతంలో కొత్త వ్యక్తులు ఉండటం వల్ల అనుమానించిన స్థానికులు వారిని పట్టుకుని నిలదీశారు. ఈ ప్రాంతంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, తాయత్తులను గమనించి వారిని పోలీసులకు అప్పగించారు. గ్రామంలో చేతబడి చేసేందుకు ప్రయత్నించడం స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details