ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మర్రిపాడులో క్షుద్ర పూజల కలకలం... భయాందోళనలో ప్రజలు - మర్రిపాడులో క్షుద్ర పూజలు వార్తలు

నెల్లూరు జిల్లా మర్రిపాడు పట్టణంలో చిల్లర దుకాణం ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. కిరాణ దుకాణం ముందు నిమ్మకాయలతో ముగ్గు ఉండటంపై.. స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

black magic at marripadu
దుకాణం ముందు క్షుద్ర పూజలు

By

Published : Mar 31, 2021, 7:18 PM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు పట్టణంలో చిల్లర దుకాణం ఎదుట ముగ్గు వేసి అందులో.. నిమ్మకాయలతో క్షుద్ర పూజ చేసినట్టుగా కనిపించిన దృశ్యం.. స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. షాపు యజమాని పది గంటలకు.. దుకాణాన్ని మూసి ఇంటికి వెళ్లారు.

ఉదయాన్నే చూడగా.. ఆ ప్రాంతంలో ముగ్గులు, నిమ్మకాయలు పెట్టి ఉన్నాయి. భయాందోళనకు గురైన దుకాణదారుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details