ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 13, 2020, 7:34 PM IST

ETV Bharat / state

'రాష్ట్రంలో అరకొరగానే సంక్షేమ పథకాలు.. అభివృద్ధి శూన్యం'

రాష్ట్రంలో పాలన తిరోగమనంలో సాగుతోందని భారతీయ జనతా యువ మోర్చా ధ్వజమెత్తింది. ఏడాది పాలనలో అరకొర సంక్షేమ పథకాలు తప్ప, అభివృద్ధి శూన్యమని విమర్శించింది.

nellore  district
bjp Criticism on yscrp govt

నెల్లూరులో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు, నెల్లూరు భాజపా పార్లమెంట్ అధ్యక్షుడు భరత్ కుమార్... వైకాపా ప్రభుత్వ పాలనపై విమర్శలు కురిపించారు. పోలవరాన్ని మూలన పడేశారని, రాజధాని ఎక్కడన్నది చెప్పుకోలేని పరిస్థితికి తీసుకువచ్చారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతలను వేధించి కేసు నమోదు చేయటం, అధికార పార్టీలో చేరితే వాటిని మాఫీ చేయటం పరిపాటిగా మారిందన్నారు. కక్షపూరితంగా ప్రతిపక్షాలను అణచివేయాలని చూడటం దారుణమని చెప్పారు. అధికార పార్టీ అండదండలతో రాష్ట్రంలో యథేచ్చగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందని రమేష్ నాయుడు ఆరోపించారు.

ఎర్రచందనం సరిహద్దు దాటుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. ప్రతి రూపాయికీ జవాబుదారితనంగా ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రంగులు వేయడానికి 1300 కోట్ల రూపాయలు.. వాటి తొలగింపునకు మరో 1300 కోట్ల రూపాయలు వృథా చేశారన్నారు. ఈ డబ్బుతో రాయలసీమ కరవును పారద్రోలే అవకాశముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని భాజపా నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు భరత్ కుమార్ విమర్శించారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించి.. ప్రతిపక్ష నేతలను టెర్రరిస్టుల మాదిరి అరెస్ట్ చేయటం దారుణమన్నారు.

ABOUT THE AUTHOR

...view details