ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్​ది తుగ్లక్ చర్య: భాజపా నేత ఆంజనేయరెడ్డి - bjp state spokesperson anjaneya reddy comments on ys jagan 3 capitals in ap state

కేంద్రంతో సంప్రదింపులు జరపకుండా రాజధానిపై నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదన్నారు భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి. రాజధాని మార్పును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.

bjp state spokesperson anjaneya reddy
జగన్​ది తుగ్లక్ చర్య భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి

By

Published : Dec 23, 2019, 6:17 PM IST

జగన్​ది తుగ్లక్ చర్య... భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి

రాజధాని మార్పును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. నెల్లూరులో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ... పరిపాలన రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మూడు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ తీసుకున్న నిర్ణయం తుగ్లక్ చర్య అని విమర్శించారు. జీఎన్​ రావు కమిటీ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండానే రాజదాని మార్పు ఏలా ప్రకటిస్తారని మండిపడ్డారు. ప్రజల అందరి ఆమోదంతో మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిలోనే రాజధాని కొనసాగించాలన్నారు. హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details