కార్యకర్తలపై దాడులు చేయడం వైకాపా మానుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తొలిసారి నెల్లూరుకు వచ్చారు. వీర్రాజుకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న ఆయన కార్యకర్తలతో సభను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తున్నారని... గతంలో తెదేపా అధినేత చంద్రబాబు, నేడు వైకాపా అధినేత వైయస్. జగన్ వారి బొమ్మలు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు ప్రభుత్వానికి వత్తాసు పలకడం మానుకోవాలని హితవు పలికారు. గ్రామాల్లోకి వెళ్లి కేంద్ర పథకాలను భాజపా కార్యకర్తలు ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
"తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పోటీ వైకాపా , భాజపా మధ్యే. విజయం భాజపా అభ్యర్థిని వరిస్తుంది. నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలి"
--సోము వీర్రాజు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.