నెల్లూరు జిల్లా గుడూరు డీఎస్పీ కార్యాలయం ఎదుట భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు భారీ ధర్నా నిర్వహించారు. భాజపా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ... అధికార పార్టీ నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జరిగే అధికార పార్టీ అరాచకాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు తప్పు చేస్తుంటే ప్రజల పక్షాల నిలబడి సరిచేయాల్సిన వ్యవస్థే అధికార పార్టీకి కొమ్ము కాయటం దారుణమన్నారు.