ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో బీసీలను మానసిక వేదనకు గురి చేస్తున్నారు: సోము వీర్రాజు

BJP OBC Morcha State Executive Meeting : రాష్ట్రంలో బీసీలు మానసిక వేదనకు గురవుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీసీల సంక్షేమానికి కేంద్రం అందిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని సోము వీర్రాజు విమర్శించారు.

బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం
బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం

By

Published : Mar 26, 2023, 9:05 PM IST

BJP OBC Morcha State Executive Meeting : రాష్ట్రంలో బీసీలు మానసిక వేదనకు గురవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నెల్లూరు నగరంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సోము వీర్రాజుతో పాటు ఓబీసీ మోర్చా రాష్ట్ర నేతలు హాజరు అయ్యారు. బీసీల సంక్షేమానికి కేంద్రం అందిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆయన విమర్శించారు. బీసీ కార్పొరేషన్​ను బలోపేతం చేసి, నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కాంట్రాక్ట్ ఇచ్చే విధానాన్ని బీసీ కార్పొరేషన్స్​కి ఇచ్చి వారికి భరోసా కల్పించాలని ఆయన అన్నారు.

నరేంద్ర మోదీ సంక్షేమ ఫలాలు : ప్రధానమంత్రి పేదల్ని, బడుగు, బలహీన వర్గాల వాళ్ల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల పథకాలు అమలు చేస్తున్నారనీ, ఉచితంగా గ్యాస్, జన్​ధన్ అకౌంట్లు ఏర్పాట్లు చేయడం, ఉచిత ఇళ్లు నిర్మించడం ఇవన్నీ నరేంద్ర మోదీ సంక్షేమ ఫలాలని సోము వీర్రాజు అన్నారు.

వైఎస్సాసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ : వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో యధేచ్ఛగా దోపిడీ సాగుతోందని విమర్శించారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతుందని, కోర్టు శిక్షలు, ఫైన్ విధించే పరిస్థితి ఏర్పడిందని, ఇసుకను నదుల్లో మిషన్లు పట్టి తవ్వేసే పరిస్థితి ఏర్పడిందని, ఇసుకను విపరీతంగా పార్టీ నాయకులు వినియోగించడం, స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఇసుకను దోపిడీ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇసుక, సిలికా, మట్టి అక్రమ తొవ్వకాలపై బీజేపీ ఉద్యమిస్తుందని ప్రకటించారు.

రాహుల్ గాంధీకి శిక్ష..ఉద్యమాలు చేయడం అర్థరహితం : ఒక నిమ్న వర్గ కులాన్ని విమర్శిస్తూ, హేళనగా మాట్లాడిన రాహుల్ గాంధీకి కోర్టు శిక్ష విధించింది. చట్ట ప్రకారం ఆయన ఎంపీ పదవి రద్దు అయితే రాష్ట్రంలో, దేశంలోని విపక్షాలు ఉద్యమాలు చేయడం అర్థరహితమన్నారు.

భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన సోమువీర్రాజు

" ఆంధ్రప్రదేశ్​లో బీసీలకు తీవ్రమైన మానసిక వేదనకు గురి చేస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంగా నేను భావిస్తున్నాను. ఆర్ధికంగా నిధులు ఇవ్వకుండా, అధికారాలు ఇవ్వకుండా ఉప ముఖ్యమంత్రులను చేసేటటువంటి వారి యొక్క పరిపాలన తీరుతెన్నులను బీజేపీ తీవ్రంగా గర్హిస్తుంది. నిజంగా ముఖ్యమంత్రి గారికి నిజాయితి ఉన్నట్లయితే బీసీ కార్పరేషన్ అన్నింటికి కూడా బలోపేతం చేసే చర్యలు తీసుకోవాలనేది భారతీయ జనతా ఓబీసీ మోర్చా డిమాండ్ చేస్తుంది. వాటికి నిధులు కేటాయించండి"-సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details