ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్లకార్డులతో భాజపా నాయకుల నిరసన ప్రదర్శన - BJP leaders protest at nellore district news update

నివేశన స్థలాల మంజూరులో అవినీతిని అరికట్టి అర్హులైన పేదలకు నివేశ స్థలాలు మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భాజపా నాయకులు కోరారు. పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా నెల్లూరు జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ కూడలిలో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

BJP leaders protest
ప్లకార్డులతో భాజపా నాయకులు నిరసన ప్రదర్శన

By

Published : Jul 22, 2020, 8:30 PM IST

నెల్లూరు జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ కూడలిలో భాజపా నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించి నిరుపయోగంగా ఉన్న పక్కా గృహాలను అర్హులైన పేద ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పాటు పడుతున్నామంటూ చెప్పే మాటలు.. ఆచరణలో కనిపించడం లేదని భాజపా రాష్ట్ర ఓబిసి కార్యవర్గ సభ్యుడు రోశయ్య ఆరోపించారు. అసంపూర్తిగా ఉన్న పక్కా గృహాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి పేదలకు కేటాయించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఓబీసీ అధ్యక్షుడు వెంకటాద్రి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details