భాజపా నేత విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి చేసిన ఘటనను నెల్లూరు భాజపా నేతలు ఖండించారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. విష్ణువర్ధన్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిబేట్ జరుగుతున్న సమయంలో ఇలా ప్రవర్తించడం మంచిది కాదని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి'
నెల్లూరులో భాజపా నేతలు ఆందోళన చేపట్టారు. పార్టీ నేత విష్ణువర్థన్ రెడ్డిపై దాడి ఘటనను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నెల్లూరులో భాజపా నేతలు ఆందోళన