ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హిందూ దేవాలయ ఆస్తులకు రక్షణ కల్పించాలి' - somashila bjp leaders agitation news

హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని నెల్లూరు జిల్లా సోమశిలలో భాజపా ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అంతర్వేది రథం దగ్ధమైన ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

bjp agitation
భాజపా నేతల నిరసన

By

Published : Sep 10, 2020, 8:09 AM IST

నెల్లూరు జిల్లా అనంతసారం మండలం సోమశిలలో భాజపా నేతలు ఆందోళనకు దిగారు. హిందూ దేవాలయ ఆస్తులకు రక్షణ కల్పించాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. సోమశిల సోమేశ్వర ఆలయంలో పట్టపగలే వినాయకుడి విగ్రహం దొంగలించి నెలలు గడుస్తున్నా కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతోందన్నారు. ఈ ఘటనపై స్థానిక మంత్రి స్పందించకపోవటమేంటని నిలదీశారు. అంతర్వేది రథం దగ్ధం కావటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనీ.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details