ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకునే అధికారులు(bjp leader somu veerraju on employees).. అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. అధికారులు న్యాయపరంగా తమ విధులు నిర్వహించాలి కానీ.. అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ పనులు చేస్తుండటం మంచి పద్ధతి కాదని సోము వీర్రాజు అన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వైకాపాకు ప్రజల బలమే ఉంటే.. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై రౌడీయిజం, దౌర్జన్యాలు ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. కేంద్రం నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తూ.. జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వైకాపాను ఎదుర్కొనే దమ్ము భాజపా, జనసేనకు ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.