ఇంకుడు గుంతలతో నీటి ఎద్దడి దూరం... - no water
వర్షపు నీటి జాడ కనపడట్లేదు. భూగర్భజలాలు పాతాళానికి చేరడంతో తాగునీటికి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జల సంరక్షణకు చర్యలు చేపడుతోంది. దీనిని స్పూర్తిగా తీసుకున్న రాధాకృష్ణారెడ్డి అనే వ్యక్తి నెల్లూరులో ఇంకుడుగుంతలు నిర్మించి ఆదర్శంగా నిలుస్తున్నారు.
water
ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన జల సంరక్షణ ఉద్యమం స్ఫూర్తితో నెల్లూరు నగరంలో భాజపా నేత ఇంకుడు గుంటలు నిర్మించారు. తన ఇంటి ఆవరణలో 2 ఇంకుడు గుంతల నిర్మించి వర్షపు నీరు అందులోకి చేరేలా ఏర్పాట్లు చేశారు. మేడపైన పడే వర్షపు నీరు సైతం ఇంకుడు గుంటల్లోకి వచ్చేలా పైపులు ఏర్పాటు చేశారు. రోజు రోజుకి నీటి ఎద్దడి ఎక్కువ అవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించాల్సిన అవసరం ఉందని రాధాకృష్ణారెడ్డి తెలిపారు.