అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములను బలవంతంగా లాక్కొని, వాటినే తిరిగి పంపిణీ చేస్తుండటం సమంజసం కాదని నెల్లూరు భాజపా పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు భరత్ కుమార్ అన్నారు.
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: భాజపా నేత భరత్ కుమార్ - అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని భాజపా నేత భరత్ కుమార్ డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: భాజపా నేత భరత్ కుమార్
ఇళ్ల స్థలాలు కూడా తమ అనుచరులకే వచ్చేలా జాబితాలు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు చేయాల్సిన వాలంటీర్లు రాజకీయాలు చేస్తున్నారని.. ఇది దారుణమని ఆగ్రహించారు.