ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లేఖలతో తప్పుదోవ పట్టిస్తున్నారు: భాజపా నేత ఆంజనేయరెడ్డి - viveka murder case latest updates

వైఎస్ వివేకా హత్య కేసులో విజయమ్మ లేఖపై భాజపా నేత ఆంజనేయరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. లేఖలో భాజపా నేత ఆదినారాయణరెడ్డిపై అనుమానం వ్యక్తం చేయడం సరికాదని అన్నారు. లేఖలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆక్షేపించారు.

bjp leader anjaneyareddy
భాజపా నేత ఆంజనేయరెడ్డి

By

Published : Apr 7, 2021, 4:26 PM IST

వైఎస్ వివేకా హత్య కేసులో రెండేళ్ల తర్వాత విజయమ్మ లేఖ రాయడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని భాజపా నేత ఆంజనేయరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్న వారే నిజాలు తేల్చకుండా లేఖలు రాయడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డిపై.. విజయమ్మ అనుమానం వ్యక్తం చేయడం సరికాదన్నారు. ఈ ఘటనపై జగన్ ప్రభుత్వం విచారణ చేపట్టిందో లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేఖలతో ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details