BJP KISAN MORCHA PROTEST AT NELLORE : మాండౌస్ తుపాన్ కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల రైతులను ఆదుకోవాలని కోరుతూ నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీగా వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతి ఏడాది రైతులు నష్టపోతున్నా.. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని విమర్శించారు. అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు నాయకులు, రైతులు వినతి పత్రం అందజేశారు.
'పంట నష్టపోయిన రైతుకు.. ఎకరాకు రూ. 20వేల పరిహారమివ్వాలి' - మాండౌస్ తుపాన్
BJP KISAN MORCHA PROTEST : తుపాన్ కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా నేతలు డిమాండ్ చేశారు. ర్యాలీగా వచ్చి నెల్లూరు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశారు. రైతులను ఆదుకోవాలంటూ.. కలెక్టర్కు వినతిపత్రం అందించారు.
నష్టపోయిన రైతుకు ఎకరాకు 20వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒంగోలు, నెల్లూరు జిల్లాలో నష్టపోయిన పొగాకు రైతులకు నష్టపరిహారం అందజేయాలన్నారు. రాయలసీమ ప్రాంతాల్లో వరి నాట్లు వేసి నష్టపోయిన రైతులకు 10 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఆర్బీకేలు తేమ పేరుతో మిల్లుకు పంపితే మిల్లర్లు రైతుల నుంచి ఎక్కువ వసూలు చేస్తున్నారని.. ఈ విధానాన్ని నిరోధించాలని డిమాండ్ చేశారు. మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: