నెల్లూరు నగరంలోని భాజపా కార్యాలయంలో భాజపా, జనసేన పార్టీలు సంయుక్తంగా నిరసన చేపట్టాయి. హౌస్ ఫర ఆల్ కింద నిర్మించిన ఇళ్లను అర్హులైన పేదలకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రధాని మోదీ ఆరేళ్ల క్రితం హౌస్ ఫర్ ఆల్ పథకం ప్రారంబించారని వారు తెలిపారు. గత ప్రభుత్వం నిర్మాణ వ్యయం పెంచి ఇళ్ల పనులను జాప్యం చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం నిర్మాణం పూర్తి అయిన ఇళ్లను కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.
'అర్హులైన పేదలకు ఇళ్లు వెంటనే ఇవ్వాలి'
హౌస్ ఫర ఆల్ కింద నిర్మించిన ఇళ్లను అర్హులైన పేదలకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో భాజపా, జనసేన పార్టీలు సంయుక్తంగా నిరసన చేపట్టాయి.
అర్హులైన పేదలకు ఇళ్లు వెంటనే ఇవ్వాలి
కొత్తగా ప్రభుత్వం సెంటు భూమి అనే పథకాన్ని తీసుకురావటంతో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా నిర్మాణం పూర్తైన ఇళ్లను పేదలకు పంపిణీ చేసి, నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయ్యాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నేతలు భరత్ కుమార్, ఆంజనేయరెడ్డి, కిషోర్, శ్రీకాంత్ లు పాల్గొన్నారు.