తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో... నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో భాజపా అభ్యర్థి రత్నప్రభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విద్యావంతురాలైన మహిళకు అవకాశం కల్పించిందని నాయకులు ప్రజలకు వివరించారు. రత్నప్రభకు మహిళలు హారతులు పట్టారు. ఆమె వెంట తిరుపతి పార్లమెంటు భాజపా అధ్యక్షుడు ఎస్.దయాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి ఉప ఎన్నిక: నాయుడుపేటలో భాజపా విస్తృత ప్రచారం - నాయుడుపేటలో రత్నప్రభ ఎన్నికల ప్రచారం
తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నిక భాజపా అభ్యర్థి రత్నప్రభ.. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రచారం చేశారు. తననే గెలిపించాలని ఓటర్లను కోరారు.
రత్నప్రభ ఎన్నికల ప్రచారం