ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాలని భాజపా ఆందోళన

నెల్లూరు జిల్లాలో ధాన్యం మాఫియా రాజ్యమేలుతోందని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర లభించడం లేదని నెల్లూరులో భాజపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

bjp agitation about minimum support price for grain
ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాలని భాజపా ఆందోళన

By

Published : Aug 31, 2020, 5:56 PM IST

నెల్లూరు జిల్లాలో ధాన్యం మాఫియా రాజ్యమేలుతోందని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర లభించడం లేదని నెల్లూరులో భాజపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ, నగరంలోని భాజపా కార్యాలయంలో ధర్నా చేపట్టారు.

కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా మారాయని, దళారులు రైతన్నలను మోసగిస్తున్నారని వారు విమర్శించారు. తక్కువ ధరకు అమ్మి రైతులు ఓ పక్క నష్టపోతుంటే.. దళారులు ఎక్కువ ధరకు అమ్ముకుని లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. రైతులకు న్యాయం చేసేలా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు ఆంజనేయరెడ్డి, సురేంద్రరెడ్డి, భరత్ కుమార్ తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: 'ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరిగితే సహించేది లేదు'

For All Latest Updates

TAGGED:

Bjp Nirasana

ABOUT THE AUTHOR

...view details