నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలోని యకసిరి గ్రామప్రజల దాహార్తి తీర్చాలని భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. యాకసిరి పెద్దచెరువుకు తెలుగుగంగ నీటిని విడుదల చేసినా, కొందరు రాజకీయ నాయకులు వాటిని దారిమళ్లించారని భాజాపా నేత మిడతల రమేష్ ఆరోపించారు. ఫలితంగా గ్రామంలో రెండు వేల కుటుంబాలు తాగునీటి కోసం అవస్థలు పడాల్సి వస్తోందని ఆవేదన చెందారు. అక్రమంగా నీటిని తరలించిన వారిపై చర్యలు తీసుకుని, గ్రామంలో నీటి ఎద్దడిని నివారించాలని డిమాండ్ చేశారు.
యకసిరిలో తాగునీటి సమస్య తీర్చాలని భాజపా ఆందోళన - Neti Kosam Bjp Nirasana
నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలోని యకసిరి గ్రామ ప్రజల దాహార్తి తీర్చాలని భాజపా డిమాండ్ చేసింది. నగరంలోని జలవనరుల శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు.
![యకసిరిలో తాగునీటి సమస్య తీర్చాలని భాజపా ఆందోళన bjp agitated for solve drinking water problem](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7833705-149-7833705-1593533768240.jpg)
యకసిరిలో తాగు నీటి సమస్య తీర్చాలని భాజపా ఆందోళన
TAGGED:
Neti Kosam Bjp Nirasana