ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆత్మకూరు ఉప ఎన్నిక.. భాజపా ఏజెంట్‌ కిడ్నాప్​నకు యత్నం

BJP agent Kidnap Attempt: ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్​లో వైకాపా నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని భాజపా అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ ఆరోపించారు. కృష్ణాపురం పోలింగ్‌ కేంద్రంలో పార్టీ ఏజెంట్​ను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని భరత్​ పేర్కొన్నారు.

BJP agent kidnap Attempt
BJP agent kidnap Attempt

By

Published : Jun 23, 2022, 5:09 PM IST

ఆత్మకూరు ఉపఎన్నిక.. భాజపా, వైకాపా వర్గీయుల మధ్య తోపులాట

BJP agent kidnap Attempt in Atmakur Bypoll: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్​ సందర్భంగా అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతుందని భాజపా నేతలు ఆరోపించారు. మర్రిపాడు మండలం కృష్ణాపురం పోలింగ్‌ కేంద్రంలో భాజపా ఏజెంట్ విష్ణుని కిడ్నాప్ చేసేందుకు పలువురు యత్నించారు. కారులో తీసుకెళ్తున్న ఏజెంట్​ను భాజపా అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ తిమ్మనాయుడుపేట వద్ద గుర్తించి రక్షించారు. ఆ సమయంలో భాజపా, వైకాపా నాయకుల మధ్య తోపులాట జరిగింది.

ఈ విషయాన్ని జిల్లా ఎస్పీతో పాటు ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు కమలం పార్టీ నేతలు చెప్పారు. ఏజెంట్‌ను వైకాపా నాయకులే కిడ్నాప్‌నకు యత్నించారని ఆరోపించారు. పడమటి నాయుడుపల్లి పోలింగ్ కేంద్రం వద్ద గుంపులు గుంపులుగా ఉన్న వైకాపా నాయకులను చెదరగొట్టేందుకు ప్రయత్నించగా.. వారంతా పోలీసులుపై ఎదురుదాడి చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ.. వెంటనే పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details