నెల్లూరు జిల్లాలో సంగం మండలంలో ఆత్మకూరు వైపు వెళ్తున్న బైక్ బీరాపేరు బ్రిడ్జ్ సమీపంలో జాతీయ రహదారిపై అదుపుతప్పి రోడ్డు పక్కన మార్జిన్ రాళ్లను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు ఆత్మకూరు మండలం నల్లపురెడ్డి పల్లి గ్రామానికి చెందిన గంగయ్యగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అదుపు తప్పిన ద్విచక్ర వాహనం.. ఒకరు మృతి - bike accident in snagam one man died
నెల్లూరు జిల్లా సంగం మండలం బీరాపేరు బ్రిడ్జ్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి రాళ్లను ఢీకొట్టింది. బైక్ వారిలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
అదుపు తప్పిన ద్విచక్ర వాహనం.. ఒకరు మృతి