BJP and janasena Leader fire on Nellore district YSRCP leaders: నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు గుత్తేదారులతో కుమ్మకై నాసిరకం సీసీ రోడ్లు వేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం చేసిన నెల రోజులకే సిమెంట్ రోడ్డు గుంతలుగా మారి సిమెంటంతా బూడిదలాగా గాలికి లేస్తుందంటూ ఆవేదన చెందుతున్నారు. రూ.35 లక్షలతో వేసిన సిమెంట్ రోడ్డు నెల రోజులకే అధ్వానంగా తాయరవ్వడంతో పాదాచారులు, వాహనాదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి రోడ్డుకు మరమ్మతులు ప్రారంభించాలని కోరుతున్నారు.
బూడిదతో రోడ్లు వేయొచ్చని వైసీపీ నేతలు నిరూపించారు.. ప్రజాధనాన్ని వృధా చేయడమే కాకుండా.. గుత్తేదారులతో కుమ్మకై వైఎస్సార్సీపీ నేతలు లక్షల రూపాయలు దోచుకుంటున్నారని.. స్థానిక భారతీయ జనతా పార్టీ నేత శ్రీను ఆరోపించారు. నెల్లూరులోని ప్రధాన వ్యాపార కూడలి పప్పుల వీధిలో కొన్ని నెలల క్రితం వేసిన సీసీ రోడ్డును ఈరోజు బీజేపీ, జనసేన నేతలు కలిసి పరిశీలించారు. అనంతరం రూ. 35 లక్షల రూపాయలతో వేసిన సిమెంట్ రోడ్డు నెల రోజులకే అధ్వానంగా తాయరైందని శ్రీను మండిపడ్డారు. బూడిదతోనూ రోడ్లు వేయొచ్చని వైఎస్సార్సీపీ నేతలు నిరూపించారని.. జనసేన నేత సుజిత్ బాబు ఎద్దేవా చేశారు. ఇలాంటి నాసిరకం రోడ్లు నెల్లూరు నగరంలో అనేకం వేశారని స్థానికులు విమర్శించారు.
గుంతలుగా మారి సిమెంటంతా బూడిదలా లేస్తుంది..నెల్లూరు నగరంలో నిర్మాణం చేసిన నెల రోజులకే సిమెంట్ రోడ్డులు గుంతలుగా మారి.. సిమెంటంతా బూడిదలా గాలికి లేస్తుందని.. బీజేపీ, జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మా నమ్మకం నువ్వే జగన్' అనే పేరుతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసి, శిలాఫలకంపై ప్రచార ముద్రలు వేశారు కానీ, నాణ్యమైన రోడ్లు వేయలేదని మండిపడ్డారు. ఒక్కసారి నిర్మాణం చేపడితే 30 సంవత్సరాలు ఉండాల్సిన సిమెంట్ రోడ్డులు.. నిర్మాణం చేసిన నాలుగు నెలలకే గుంతలుగా మారయన్నారు. నెల్లూరు నగరంలోని ప్రధాన వ్యాపార కూడలి పప్పుల వీధిలో వైఎస్సార్సీపీ నాయకుడు గుత్తేదారుతో కలిసి నిర్మిణించిన రోడ్డును.. జనసేన నేత సుజిత్ బాబు, బీజేపీ నేత శ్రీను పరిశీలించారు.