నెల్లూరు జిల్లా గూడూరులో తెదేపా నేత పాశం సునీల్ కుమార్, నాయకులు, కార్యకర్తలు ప్రజా చైతన్య యాత్ర చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించి లబ్ధిదారులకు కేటాయించిన 5,103 ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులకు కేటాయించని కారణంగా ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆగ్రహించారు. లబ్ధిదారులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. గత కేటాయింపుల ప్రకారం ఇళ్లు మంజూరు చేయకుంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఇళ్ల లబ్ధిదారులు నిరసన
By
Published : Mar 3, 2020, 5:23 PM IST
మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఇళ్ల లబ్ధిదారుల నిరసన