నెల్లూరు జిల్లా సంగం మండలం బీరాపేరు బ్రిడ్జి వద్ద ఇసుక రీచ్లోకి వెళ్లేందుకు వచ్చిన వందల లారీలను రైతులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. భారీ ఇసుక వాహనాలు బ్రిడ్జిపై వెళ్తున్నందున.. అది కూలిపోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఆ వాహనాల కారణంగా తాము పొలాల్లోకి కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రెండు రోజుల్లో ప్రత్యామ్నాయం చూసుకోకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
బీరాపేరు బ్రిడ్జి వద్ద రైతుల నిరసన.. ఇసుక లారీల నిలిపివేత
నెల్లూరు జిల్లా సంగం మండలం బీరాపేరు బ్రిడ్జి వద్ద ఇసుక లారీలను రైతులు అడ్డుకున్నారు. భారీ ఇసుక వాహనాలు బ్రిడ్జిపై వెళ్తున్నందున.. అది కూలిపోయే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆరోపించారు.
Beeraperu Bridge