ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని భారతీయ జనతా మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ వెల్లడించారు. దేశంలోని ప్రజలందరనీ సమాన భావంతో చూస్తూ, వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని నెల్లూరులో చెప్పారు.
త్రిపుల్ తలాక్ రద్దుతోపాటు మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలను కేంద్రం అమలు చేస్తోందన్నారు. కుటుంబ పాలన ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారని విమర్శించారు. ఉగ్రవాద భావజాలాలున్న కొన్ని సంస్థల పట్ల ముస్లిం మైనారిటీ లు అప్రమత్తంగా ఉండాలని కోరారు.