నెల్లూరులోని బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ అట్టహాసంగా సాగుతోంది. బారా షహీద్ దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. చదువు రొట్టి, ఆరోగ్యం రొట్టి, ధన రొట్టి, వివాహ రొట్టి ఇలా ఎవరికీ కావాల్సిన రొట్టెలను వారు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయటంతో... భక్తులు ఆయా ప్రదేశాలకు వెళ్లి రొట్టెలు పట్టుకుంటున్నారు. రొట్టెల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బోటులో విహరిస్తూ రొట్టెల పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
'కన్నుల విందుగా బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ'
బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ కన్నుల విందుగా సాగుతోంది. కోర్కెల రొట్టెలు మార్చుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రొట్టెల పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
'కన్నుల విందుగా బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ'