శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన వందన ఎంతో కాలంగా బియ్యపు గింజలపై చిత్రాలు, అక్షరాలను అమర్చుతోంది. బియ్యపు గింజలపై రాతలతో తన ప్రతిభ చూపిస్తోంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని బియ్యపు గింజలపై బాపూజీ సూక్తులను పొందుపర్చింది. కృషితో సంపాధించుకునేదే శాశ్వతం, చదివితే వచ్చే ఆనందం.. విజయానికి దారి అంటూ పలు సూక్తులను వందన లిఖించారు.
బియ్యపు గింజలపై బాపూజీ సూక్తులు లిఖించిన వందన - quotations written on rice grain latest News
జాతిపిత గాంధీ జయంతిని పురస్కరించుకుని సూక్ష్మ కళాకారిణి వందన బియ్యపు గింజలపై మహాత్ముని సూక్తులు రాసింది. చేతితో పట్టుకుంటేనే చేజారిపోయే సన్నటి బియ్యపు గింజలపై అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ మహోన్నత మూర్తి చిత్రాన్ని గీసింది. కొండంత ఆత్మవిశ్వాసంతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దింది.
బియ్యపు గింజలపై బాపూజీ సూక్తులు లిఖించిన వందన