పక్కా సమాచారంతో నెల్లూరు జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించిన పోలీసులు 3.7 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా రవాణా చేస్తున్న వాహన డ్రైవర్ సయ్యద్ తన్వీర్‌ను అరెస్టు చేశారు. రొయ్యలు తరలించే కంటైనర్ వాహనంలో గుట్కా అక్రమ రవాణా జరుగుతున్నట్లు సీఐ. బాజీజాన్ సైదా తెలిపారు.
నెల్లూరు నుంచి కేరళకు రొయ్యల లోడు తీసుకెళ్లి, తిరుగు ప్రయాణంలో తమిళనాడులోని కృష్ణగిరి నుంచి నిషేధిత గుట్కా, ఖైనీలను నగరానికి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. డబ్బుకు ఆశపడిన కారణగానే.. డ్రైవర్ గుట్కాలను తీసుకువచ్చాడన్నారు. పరారీలో ఉన్న అసలు వ్యాపారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.