నెల్లూరు నగరంలోని గోల్డెన్ జూబ్లీ హాల్లో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది బ్యాంకు రుణ లక్ష్యం 20వేల 840 కోట్ల కాగా అందులో వ్యవసాయ అనుబంధ రంగాలకు 14 వేల 402 కోట్లు కేటాయించారు. అందులో వ్యవసాయరంగానికి ప్రత్యేకంగా రూ.7130 కోట్లు కేటాయించినట్టు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ తెలియజేశారు. బ్యాంకు వచ్చిన ప్రతి రైతుకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు.
బ్యాంకుల వార్షిక లక్ష్యంలో వ్యవసాయానికి పెద్దపీట - జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం... హజరైన వ్యవసాయ అనుబంధ శాఖాధికారులు
బ్యాంకు వార్షిక రుణ లక్ష్యంలో వ్యవసాయానికి పెద్దపీట వేసినట్టు అధికారులు తెలిపారు. నెల్లూరులోని గోల్డెన్ జూబ్లీ హల్లో జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.

జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం
Last Updated : Jul 4, 2019, 1:41 AM IST
TAGGED:
BANKERS MEETING IN NLR